మర్రిగూడ : మండల పరిధిలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఈ నెల 19న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోగా.. ఆమె ఆచూకీ లభ్యమైనట్లు ఎస్‌ఐ బి. రాంబాబు గురువారం తెలిపారు. లక్ష్మి కనిపించట్లేదని ఆమె భర్త యాదయ్య ఈ నెల 20న మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు. ప్రత్యేక బృందాలతో గాలించి లక్ష్మి ఆచూకీ కనిపెట్టి, ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.


