భారీ బందోబస్తు..
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో(వైటీపీఎస్) స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రస్తుత ఎమ్మెల్యే ఆంధ్రా ప్రాంతం వారికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కొరత కారణంగా యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం పవర్‌ప్లాంట్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిఽధిలోని మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి పరిశీలించారు. అనంతరం పవర్‌ప్లాంట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆంధ్రాకు చెందిన వారు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఆంధ్రా వారికి అమ్ముకుంటూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టి తాను అనుకున్న వారికి బొగ్గు సరఫరా చేస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గృహ, పరిశ్రమలకు కరెంట్ కోతలు విధిస్తుండడంతో జనరేటర్లను వినియోగించాల్సి వస్తోందన్నారు. తెలంగాణ వచ్చేనాటికి 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని 21,500 మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ సాంకేతికతతో వైటీపీఎస్ నిర్మాణం జరిగిందన్నారు. ప్రస్తుతం 4యూనిట్లు నడవడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు సైతం తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని విమర్శించారు. సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం :
నల్లమోతు భాస్కర్‌రావు
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హెచ్చరించారు. 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే 2వేల మెగావాట్లను వినియోగించుకున్నారని, అదే 2వేల మెగావాట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో ఆలోచించాలన్నారు. ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబ్బులతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హయాంలో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ప్లాంట్‌లోని బూడిదను ఎవరు తరలించుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్, నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, బాలాజీనాయక్, ఎండీ యూసుఫ్, సోము సైదిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, హాతీరాం, కొండారపు నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
పోలీసులు ముందస్తుగానే పవర్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లాంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. కేవలం మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను లోనికి వెళ్లేందుకు అనుమతించారు. మధ్యాహ్నం 4గంటల సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా పవర్‌ప్లాంట్‌కు వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రధాన ద్వారాన్ని మూసివేసి పోలీసులను భారీగా మోహరించారు. దీంతో పవర్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్ నెలకొంది.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
ఫ యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ పరిశీలన


