చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

ఫ హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ బాలికల సదనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న బాలికను గురువారం దత్తత ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు కలెక్టర్‌ సమక్షంలో దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బాలికను బాగా చదివించి, భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎం. విశ్వజ, బాల రక్షా భవన్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌. అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్‌ ఎం. కల్యాణి, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వానకు కూలిన ఇళ్లు

మోతె : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గురువారం తెల్లవారుజామున మోతె మండల కేంద్రంలో లింగాల లక్ష్మి, యాదగిరి దంపతుల ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తువులు, దుస్తులు, బియ్యం కూలిన గోడ శిథిలాల కింద నలిగిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన కొప్పు సతీష్‌, నాగమణి దంపతుల రేకుల ఇల్లు వర్షానికి తడిసి కూలిపోయింది. ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

కారు ఢీకొని

వలస కార్మికుడు మృతి

చౌటుప్పల్‌ : గణేష్‌ నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చిన వలస కార్మికుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రానికి చెందిన రాంభీయాష్‌ కేవత్‌(37) రెండు నెలలుగా లింగోజిగూడెం గ్రామంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు విజయవాడ–హైదరాబాద్‌ హైవే దాటుతుండగా.. హైదరాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభుచరణ్‌ ఫిర్యాదు మేరకు సీఐ మన్మథకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement