నల్లగొండ టౌన్ : యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ ఏకమై దండోరా వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. నల్లగొండలోని పీఆర్‌టీయూ భవన్‌లో గురువారం నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో యువత భవిష్యత్ నాశనమవుతోందన్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌పై ఏపూరి దండోరా అనే నినాదంతో ఈ నెల 29న నల్లగొండలోని గడియారం సెంటర్‌లో సభ నిర్వహించనున్నట్లు, ఈ సభకు అన్నివర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గ్రామ గ్రామాన డ్రగ్స్ అనర్థాలపై దండోరా వేయాలన్నారు. టీఎస్‌ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గూడపూరి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష, వివిధ సంఘాల నాయకులు గట్టిగుండ్ల రవి, పాలడుగు నాగార్జున, బకరం శ్రీను, మేడి నరసింహ, కందుల మోహన్, పుల్లెంల సందీప్, ఐతగోని జనార్దన్‌గౌడ్, తలారి రాంబాబు, కట్టిల శివకుమార్, కుడుతాల నాగరాజు, అనుముల సురేష్, బొజ్జ దేవయ్య, ఎర్రోళ్ల శ్రీను పాల్గొన్నారు.
ఫ ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న


