విద్యార్థినికి రూ.లక్ష నగదు బహుమతి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి రూ.లక్ష నగదు బహుమతి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంకు చెందిన రెడ్డిచర్ల నరేందర్‌రాజు కుమార్తె హరిణి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో శ్రీరామ్‌ గ్రూప్‌ సంస్థ వారు హరిణికి రూ.లక్ష బహుమతి ప్రకటించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా చేతులమీదుగా హరిణి రూ.లక్ష నగదు, ప్రశంసాప్రతం అందుకుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం బుడిగె పిచ్చయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాలం చెల్లిన మందులపై నిర్లక్ష్యం

యాదగిరిగుట్ట రూరల్‌ : మండలంలోని మసాయిపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వెనకాల కాలం చెల్లిన మందులను వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడేయంతో, పర్యావరణానికి హాని కలగడంతో పాటు మూగజీవాలు వాటిని తినే ప్రమాదం ఉంది. కాలం చెల్లిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్‌ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement