యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేశారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
రాజాపేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్ పేర్కొన్నారు. రాజాపేట మండలం బొందుగుల ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పరమేష్, మండల అధ్యక్షుడు సంపతి సుబ్బరాజు, కార్యదర్శి బాలరాజు, మహిళా ఉపాధ్యక్షురాలు భారతి, జిల్లా బాధ్యుడు రవీందర్ పాల్గొన్నారు.
సకాలంలో
అనుమతులు ఇవ్వాలి
భువనగిరిటౌన్ : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డీఐపీసీలో భాగంగా ఏడుగురు ఎస్టీ లబ్ధిదారులకు రూ.17.50లక్షల రాయితీ, నాలుగు పరిశ్రమలకు సంబంధించి రా మెటీరియల్ మంజూరుకు ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ట్రాన్స్‌పోర్ట్ అధికారి నరేష్ పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్యకు
అనుగుణంగా సర్దుబాటు
భూదాన్‌పోచంపల్లి: జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని డీఈఓ భిక్షపతి వెల్లడించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. టీచర్లు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. పిల్లల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఎక్కువ ఉన్న చోటు నుంచి అవసరం ఉన్న స్కూల్‌కు సర్దుబాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, శ్రీదేవి, పుష్పలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


