భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని వీవర్స్ సర్వీస్‌సెంటర్ రీజినల్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు. పెహచాన్ కార్డులున్న కార్మికులకు కేంద్రం వర్క్‌షెడ్, ఉచిత మగ్గాలు, ఆసుయంత్రాలను పంపిణీ చేస్తుందరు. అర్హులు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, తడక రజని, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, వెంకటరమణ సిల్క్‌సొసైటీ అధ్యక్షుడు చింతకింది రమేశ్, మాజీ కౌన్సిలర్ భోగ విష్ణు, టీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు వలందాస్ ప్రవీణ్, చేనేత నాయకులు బొమ్మ హరిశంకర్, బిట్ల గణేశ్, గుండు రాజేశ్వరీ, కటకం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.


