గుండాల : రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మిస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం పీఏసీఎస్ పాలక వర్గం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం మొదట జిల్లాకు 104 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. గుండాల పీఏసీఎస్‌కు 906 సర్వే నంబర్‌లో 4 ఎకరాలలో గోదాములు నిర్మిస్తామన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు పీఏసీఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను ఆగస్టు 15 నాటికి కేటాయిస్తామని చెప్పారు. మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ అండెం సంజీవరెడ్డి, సర్పంచ్‌లు మచ్చ నాగిరెడ్డి, దేవనబోయిన అయిలయ్య, వల్లాల రమేష్, డైరెక్టర్లు అన్నెపర్తి యాదగిరి, సంగి శ్రీనివాస్, దూదిగామ నాగరాజు, పొన్నగాని నారాయణ, చిప్పలపల్లి సోమన్న, నూనెముంతల యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్, మండల అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా పాల్గొన్నారు.


