భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతిఅధికారులను ఆదేశించారు.కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డిలతో కలిసి బాధితుల నుంచి 113 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 65, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు 15, మున్సిపాలిటీకి 7, సర్వే,ల్యాండ్ రికార్డ్స్ 4, సంక్షేమ శాఖ 3, వైద్య ఆరోగ్య శాఖ 3, ఇరిగేషన్ 2, డీసీఓ 2, డీపీఓ సంబంధించినవి 2 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, విద్య, మైన్స్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్ అండ్ బీ, మార్కెటింగ్, హౌసింగ్, సివిల్ సప్లయ్, ఇండస్ట్రీస్ జీఎం, పశుసంవర్ధక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కృతిక, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ అలివేలు తదితరులు పాల్గొన్నారు.


