సాక్షి, యాదాద్రి : రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయి. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం తహసీల్దార్ పోస్టు ఖాళీ కాగా.. ఆ పోస్టు కోసం పలువురు ఉద్యోగులు రాజకీయ నాయకులను, శాఖలోని ఉన్నతాధికారులను ఆశ్రయించి పైరవీలు చేస్తున్నారు. ఆత్మకూర్ (ఎం) తహసీల్దార్ వి.లావణ్యను బొమ్మలరామారం తహసీల్దార్‌గా బదిలీ చేయడానికి జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం వివాదానికి తెరలేపింది. ఒకచోట తహసీల్దార్‌గా ఉన్న అఽధికారిని అదే నియోజకవర్గంలోని మరో మండలానికి బదిలీకి సిఫార్సులు చేయడాన్ని తోటి అధికారులు తప్పుబడుతున్నారు. కలెక్టరేట్‌లో పలువురు తహసీల్దార్ క్యాడర్ అధికారులు సూపరింటెండెంట్‌లుగా పనిచేస్తున్న తమను కాదని ఒక చోట తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న అఽధికారిని మరో చోటుకు బదిలీ చేస్తున్నారని పేర్కొంటున్నారు.
తహసీల్దార్ పదవీ విరమణతో ఖాళీ
బొమ్మలరామారంలో తహసీల్దార్‌గా, నోటిఫైడ్ ఏఈఆర్‌ఓ(అసిస్టెంట్ ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్)గా పనిచేస్తున్న పానుగంటి శ్రీనివాసరావు గతనెల 31న పదవీ విరమణ పొందారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఆ స్థానాన్ని ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి, వెంటనే స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సునీల్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఈ ఖాళీ స్థానంలో కలెక్టరేట్ పరిధిలోని సూపరింటెండెంట్ క్యాడర్ అధికారుల్లో ఒకరిని నేరుగా నియమించవచ్చు.కానీ ఇక్కడ ఇప్పటికే ఆత్మకూర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ ఏఈఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ను బొమ్మలరామారం బదిలీ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందస్తు అనుమతి కోరుతూ జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు వివాదానికి కారణమయ్యాయి. ఆత్మకూర్ నుంచి బొమ్మలరామారానికి బదిలీ చేస్తే మళ్లీ ఆత్మకూర్‌లో మరొకరిని తహసీల్దార్‌గా వెంటనే నియమించాలి. ఈ సాంకేతిక ప్రక్రియ, ఉత్తర్వుల కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాయాల్సి రావడం వల్లనే నియామకంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
తెరపైకి ఆత్మకూర్ తహసీల్దార్ పేరు
బొమ్మలరామారం తహసీల్దార్ పోస్టు కోసం రాజకీయ ఒత్తిళ్లు, నాయకుల సిఫార్సులు నడిచినట్లు సమాచారం. దీని కోసం కలెక్టరేట్‌లో ఇద్దరు సూపరింటెండెంట్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్థానిక నేతలు, నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి సిఫార్సులేఖలతో కలెక్టరేట్‌లో వీరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర మంత్రి సిఫార్సుతో ఆత్మకూర్ తహసీల్దార్ పేరు తెరపైకి వచ్చింది. ఉన్నత స్థాయి ఒత్తిడి రావడంతో, స్థానిక ప్రజాప్రతినిఽధి సైతం తమ మద్దతుదారుల పేర్లను పక్కనబెట్టి ‘నేనే స్వయంగా ప్రతిపాదించాను’ అని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బొమ్మలరామారం మండలం హైదరాబాద్‌కు శివారునే ఉంది. ఇక్కడ భూముల ధరలు దాదాపు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ పోస్టింగ్ కోసం రాష్ట్ర స్థాయి అఽధికారులు, మంత్రుల నుంచి సిఫార్సులు ఉంటాయి. ఇక్కడ భూవివాదాలు కూడా అతి తక్కువే.
ఫ జూలై 31న పదవీ విరమణ చేసిన బొమ్మలరామారం తహసీల్దార్
ఫ ఖాళీ అయిన పోస్టు కోసం
తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు
ఫ ఆత్మకూరు(ఎం) తహసీల్దార్‌ను బొమ్మలరామారం బదిలీకి
అనుమతి కోరుతూ ఈసీకి లేఖ
ఫ అనూహ్యంగా
రాష్ట్ర మంత్రి సిఫార్సు
ఫ ఒకే నియోజకవర్గంలో బదిలీపై తోటి అధికారుల విమర్శలు


