సాక్షి, యాదాద్రి: ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఏబీడీఎం డైరెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా వర్క్‌షాప్‌ను కలెక్టరేట్‌లో బుధవారం ఆమె కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడైనా రోగి వైద్య చరిత్రను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంతే ముఖ్యమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థలు ఏబీడీఎంను విజయవంతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ నమోదును పూర్తి చేసిందన్నారు. రాబోయే మూడు నెలల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఏబీహెచ్‌ఏ( ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ అందిస్తామన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నేషనల్ హెల్త్ అథారిటీ డైరక్టర్ డాక్టర్ పంకజ్ కుమార్ అరోరా వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఏబీడీఎం అమలులో భాగంగా రోగుల నమోదు, డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, డిశ్చార్జ్ సమ్మరీలు, డిజిటల్ ఆరోగ్య రికార్డుల అనుసంధానంపై ఆరోగ్య సిబ్బందికి నిరంతర శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిష్తీ, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశం పాల్గొన్నారు.
ఫ మూడు నెలల్లో ఏబీహెచ్‌ఏ
ఐడీ కార్డులు ఇస్తాం
ఫ కుటుంబ సంక్షేమ శాఖ
కమిషనర్ సంగీత సత్యనారాయణ


