రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలు

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహించే ఎస్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ టి. శ్రీనివాస్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం ఆయన యాదగిరి కొండ పైకి వెళ్లేందుకు గాను బైక్‌పై వైకుంఠద్వారం నుంచి రాంగ్‌రూట్‌లో మొదటి ఘాట్‌ వద్దకు వెళ్తుండగా.. కొండపై నుంచి కిందకు వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డి రాంగ్‌రూట్‌లో రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానిక భక్తులు అంటున్నారు.

రైలులో నుంచి జారిపడి ..

భువనగిరి(బీబీనగర్‌) : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీబీనగర్‌–ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికుడి నుంచి కాచిగూడ వైపు రైలులో వెళ్తున్న యువకుడు బీబీనర్‌–ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య జారి కిందపడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువకుడి వద్ద మిర్యాలగూడ నుంచి చర్లపల్లి వరకు రైలు టికెట్‌ లభించిందని, అతడి ఎడమచేతిపై రోజా అని, కుడిచేతిపై ఐసు అనే పేరుతో టాటూ ఉందని, వివరాలు తెలిసిన వారు 98482 22169 నంబర్‌కు సమాచారం అందించాలని భువనగిరి రైల్వే పోలీస్‌ ఇన్‌చార్జి జే. కృష్ణారావు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement