రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తాం
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
సాక్షి, యాదాద్రి : రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలి
భువనగిరి : ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరన కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని అన్ని గ్రామాలలోగ్రామ సభలు నిర్వహించారు. కేసారం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 నుంచి జూలై 25 వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దినకర్, ఎంఈఓ రంగరాజన్, మెడికల్ ఆఫీసర్‌మల్లేష్, హోసింగ్ అధికారి రామచందర్, సర్పంచ్ మనోహర్ పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలో రూ.8.7 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ (ఇంటిగ్రేటెడ్) మార్కెట్ నిర్మాణం పూర్తయ్యి ఏడాది అవుతున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ మార్కెట్ లోపల వ్యాపారుల కోసం మొత్తం 185 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని వివిధ రకాల వ్యాపారాలకు అనుకూలంగా వర్గీకరించారు. కూరగాయలు, చిరు వ్యాపారాల కోసం 94 స్టాళ్లు, మాంసం విక్రయాల కోసం 46 స్టాళ్లు, పూల వ్యాపారులకు 19 స్టాళ్లతో పాటు మరో 17 జనరల్ స్టాళ్లను నిర్మించారు. రూ.కోట్లు కుమ్మరించి అన్ని సౌకర్యాలతో అధునాతనంగా నిర్మించిన ఈ మార్కెట్ అధికారుల అలసత్వం, పాలకుల ఉదాసీనత వల్ల నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో ఈ మార్కెట్ నిరుపయోగంగా మారింది.
ఎందుకీ జాప్యం..
మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఈ మార్కెట్ దుకాణాల కేటాయింపు ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఎన్నికల కోడ్ సాకుతో కాలయాపన చేశారు. ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. రిబ్బన్ కట్ చేసి వ్యాపారులను లోపలికి పంపుతాం అని అప్పట్లో అధికారులు ప్రకటనలు చేశారు. ఎన్నికలు ముగిసినా మార్కెట్ ప్రారంభోత్సవానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు. ఎందుకు జాప్యం చేస్తున్నారో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది.
మార్కెట్‌లో సామగ్రి దొంగలపాలు
భవనాన్ని నిర్మించి, లోపల రూ.లక్షల వ్యయంతో వైరింగ్, అధునాతన విద్యుత్ దీపాలు, ప్లంబింగ్ పనులు పూర్తిచేశారు. అయితే, కనీసం ఒక కాపలాదారుడిని (సెక్యూరిటీ గార్డు) పెట్టకపోవడంతో ఈ మార్కెట్‌లోని సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తూ చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల మార్కెట్‌లో సుమారు రూ.25 లక్షల విలువ గల కాపర్ వైర్లు, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రికల్ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు పట్టణ పోలీష్‌స్టేషన్‌లో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మార్కెట్‌ను ఇలాగే వదిలేస్తే ఈ భవనంలో ఏ వస్తువూ మిగలదని, వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఫ భువనగిరిలో రూ.8.7 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మాణం
ఫ ఏడాది క్రితమే 185 దుకాణాల్లో సౌకర్యాల కల్పన పూర్తి
ఫ దొంగల పాలవుతున్న విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రి


