రాజాపేట : రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు, దూదివెంకటాపురం హైస్కూల్ విద్యార్థిని చదువుతోపాటు క్రీల్లోనూ రాణిస్తున్నారు. గతేడాది నుంచి జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటి వివిధ మెడల్స్ సాధించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు, 2036లో జరిగే ఒలింపిక్స్‌లో తెలంగాణ తరఫున ఆడి పతకాలు సాధిస్తామని అంటున్నారు.
కబడ్డీలో సత్తాచాటుతున్న
గురుకుల విద్యార్థులు
రాజాపేట సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న డి.దిలీప్ కబడ్డీలో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నాడు. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన యువ ప్రో కబడ్డీలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన 61 జూనియర్ నేషనల్ గేమ్స్ ఆడాడు. మహబూబాబాద్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ క్రీడల్లో అండర్–19 విభాగంలో కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించాడు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సీనియర్, జూనియర్ స్టేట్ మీట్‌లో ఉత్తమ ఆటతీరు కనబర్చాడు. ఇదే కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ బైపీసీ విద్యార్థి ఎస్.అనుము మహబూబాబాద్‌లో 2025 అక్టోబర్‌లో నిర్వహించిన జూనియర్ స్టేట్ మీట్‌లో కబడ్డీ పోటీల్లోపాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. మహబూబ్‌నగర్‌లో 2024, 2025లో జరిగిన జూనియర్ స్టేట్ మీట్‌లో పాల్గొని బ్రౌంజ్ మెడల్ సాధించాడు. అలాగే సెకండియర్ విద్యార్థి బి.దేవరాజు హైదరాబాద్‌లో 2025 అక్టోబర్‌లో నిర్వహించిన యువ ప్రోకబడ్డీలో పాల్గొన్నాడు. ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చి బ్రౌంజ్ మెడల్ సాధించాడు.
సాఫ్ట్‌బాల్‌లో దూదివెంకటాపురం విద్యార్థిని..
రాజాపేట మండలం దూదివెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుల్లెన ప్రణీత ఎస్‌జీఎఫ్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణిస్తోంది. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్‌లో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 4 నుంచి 8 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని సత్తాచాటింది.
డి.దిలీప్, రాజాపేట గురుకులం
గుల్లెన ప్రణీత, దూదివెంకటాపురం
ఎస్.అనుము, రాజాపేట గురుకులం
డి.దేవరాజు, రాజాపేట గురుకులం
ఎస్‌జీఎఫ్‌లో రాణిస్తున్న గురుకుల విద్యార్థులు
ఫ కబడ్డీలో దిలీప్, దేవరాజు, అనుము ఆటతీరు అద్భుతం
ఫ జాతీయ స్థాయిలో పలు మెడల్స్ సొంతం
ఫ సాఫ్ట్‌బాల్‌లో సత్తాచాటుతున్న ప్రణీత


