రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Mar 11 2026 8:58 AM | Updated on Mar 11 2026 8:58 AM

యాదగిరిగుట్ట రూరల్‌: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామంలో గోదావరి జలాలతో నిండిన పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో రైతులకు సాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ, నవాబ్‌పేట, తపాస్‌పల్లి ప్రాజెక్టుల నుంచి ఆలేరు ప్రాంతంలోని అన్ని చెరువులు నింపడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, జనగాం ఉపేందర్‌ రెడ్డి, సర్పంచ్‌ కాల్నె సరిత, భాస్కర్‌, గుండ్ల పల్లి భరత్‌ గౌడ్‌, కానుగు బాలరాజ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వం.. రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే కుంభం

భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి వచ్చే నీటిని భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భూగర్భజలాలు తగ్గి వరి పొలాలు ఎండుతున్న నేపథ్యంలో మొదటి సారి నీటిని విడుదల చేశామన్నారు. బీఎన్‌ తిమ్మాపురం భూ నిర్వాసితులకు త్వరలో పరిహారం కింద రూ. 50కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిని విడుదల చేయడంలో సహకరించిన మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖ, రైతులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement