గ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

Mar 11 2026 8:58 AM | Updated on Mar 11 2026 8:58 AM

చౌటుప్పల్‌ : గ్యాస్‌ ధరల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీపీఎం మున్సిపల్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. యుద్ధం కారణంగా గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, మున్సిపల్‌ కార్యదర్శి గోశిక కరుణాకర్‌, కృష్ణారెడ్డి, పాష, అవ్వారు రామేశ్వరి, బండారు నర్సింహ్మ, దాసు, ధర్మయ్య, మల్లేశం, రేష్మ, స్వామి, ఆనంద్‌, ఈదయ్య, ఐలయ్య, రాములు, పెంటయ్య పాల్గొన్నారు.

మోదీ విధానాలకు వ్యతిరేకంగా గొంతువిప్పాలి

రామన్నపేట :ప్రజలు మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం రామన్నపేటలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్‌, మేక అశోక్‌రెడ్డి, పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, ఉపేందర్‌, ఏబూషి నర్సింహ, బోయిని ఆనంద్‌, హన్మంత్‌ పాల్గొన్నారు.

అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి

వలిగొండ : అర్హులైన వారందరికీ ప్రభుత్వం వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం వలిగొండలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జహంగీర్‌, బాలరాజు, రాజయ్య, సిర్పంగి స్వామి, తుర్కపల్లి సురేందర్‌, కూర శ్రీనివాస్‌, కందడి సత్తిరెడ్డి, కొండే కిష్టయ్య, శ్రీశైలం రెడ్డి, యాదయ్య, దుబ్బలింగం, సురేష్‌ పాల్గొన్నారు.

ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement