అందరికీ రాజ్యాంగ ఫలాలు
9,735 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని నిలిపేందుకు భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందించడానికి జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
– కలెక్టర్ హనుమంతరావు
సాక్షి, యాదాద్రి : గణతంత్ర వేడుకలను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవణలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఏఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జిల్లాను మరింత ప్రగతిపథంలో నిలుపుతాం. జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 427మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, 3,704 మంది వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. 2025–26 వరకు గ్రామపంచాయతీల పన్నుల డిమాండ్ రూ. 17.26 కోట్లకు గాను రూ. 8.7 కోట్లు వసూలు చేశాం.
1,27,981 మందికి మహాలక్ష్మి పథకం
మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1, 27,981మందిని అర్హులుగా గుర్తించి రూ. 500కే ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్‌లను 5, 56,172 సిలిండర్లను అందజేసి రూ. 17 కోట్ల సబ్సిడీ వారి ఖాతాల్లో జమ చేశాం. గృహజ్యోతి పథకంలో భాగంగా రూ. 96.96 కోట్ల విలువగల విద్యుత్‌ను 1,50, 568 మంది వినియోగదారులకు జీరో బిల్ ఇస్తున్నాం. రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు బీమా పథకంలో జిల్లాలో 2025–26 సంవత్సరంలో 186 మంది రైతుల కుటుంబాలకు రూ. 9. 30 కోట్లనువారి నామినీల ఖాతాల్లో జమ చేశాం.
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక తరగతులు
జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అభ్యాస దీపికలు అందజేస్తున్నాం. ఉత్తీర్ణతశాతం పెంచేందుకు ఉదయం, సాయంత్రం అదనంగా గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన 1200 మందిని గుర్తించి, గ్రామంలోని విద్యావంతులతో ప్రత్యేక సూచనలు ఇప్పిస్తున్నాం. 2025–26లో మత్స్యశాఖ ద్వారా రూ. 2.80 కోట్ల చేపపిల్ల లను 630 చెరువుల్లో వదిలాం. 2025–26 , 2026–27 సంవత్సరంలో చేనేత, అనుబంధ కార్మికుల కోసం నేతన్నకు పొదుపు పథకాన్ని 2025ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 10,790 మంది చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేసుకోగా రూ. 4.34 కోట్లు విడుదల చేశాం.జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్‌విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, డీఆర్‌ఓ జయమ్మ ,ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మందడి ఉపేందర్‌రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
8లో
ఫ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
ఫ పురోగతిలో గంధమల్ల భూ సేకరణ పనులు
ఫ ఇందిరా మహిళా శక్తి కింద 2,03,394 చీరల పంపిణీ
ఫ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 9,735 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు చేశాం. ప్రస్తుతం అవి అన్నీ పూర్తి అయ్యే దిశలో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణ దశను బట్టి రూ.195.10 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 16,17,000 పని దినాలు కల్పించి రూ. 71. 4 కోట్లు ఖర్చు చేశాం. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం ఎ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1.41 టీఎంసీల నీటి సామర్థ్యంతో రూ. 358. 16 కోట్లతో నిర్మాణ ఒప్పందం జరిగింది. భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండి రేషన్ కార్డు కలిగిన అందరు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో భాగంగా జిల్లాలో 2,03,394 చీరలు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ప్రతి నెలా 515 రేషన్ షాపుల ద్వారా అర్హత కలిగిన 2,48,757 కుటుంబాలకు 4,961 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. 2025జనవరి నుంచి నేటివరకు 34,039 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయగా, 1,80,094 యూనిట్లు కొత్తగాచేర్చి బియ్యం ఇస్తున్నాం. 2025–26 వానాకాలంలో 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,19,426 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నాం. మద్దతు ధర ప్రకారం రూ. 758 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ ఇచ్చాం. 2025 క్రిస్మస్ పండుగ సందర్భంగా రూ. 4 లక్షలతో పేద క్రైస్తవ కుటుంబాలకు విందు ఏర్పాటు చేశాం.
అందరికీ రాజ్యాంగ ఫలాలు
అందరికీ రాజ్యాంగ ఫలాలు
అందరికీ రాజ్యాంగ ఫలాలు


