విద్యార్థులపైనే దేశ భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపైనే దేశ భవిష్యత్‌

Jan 27 2026 9:53 AM | Updated on Jan 27 2026 9:53 AM

విద్యార్థులపైనే దేశ భవిష్యత్‌

విద్యార్థులపైనే దేశ భవిష్యత్‌

భూదాన్‌పోచంపల్లి: దేశభవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. యూనివర్సిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దాసేశ్వర్‌రావుతో కలిసి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాసామ్య దేశం కావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం మన బలం’ అని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌సీసీ క్యాడెట్ల ఫ్లాగ్‌మార్చ్‌, భారీ తిరంగా జెండా ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఫ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement