ముద్దాపురంలో సంపూర్ణ మద్య నిషేధం
వలిగొండ : వలిగొండ మండలంలోని ముద్దాపుంలో గణతంత్ర దినోత్సవం రోజున మహిళలు, యువత కలిసి సంపూర్ణ మద్య నిషేధానికి నడుంబిగించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత మద్యపాన నిషేధంపై సర్పంచ్ సామ సరస్వతిరాంరెడ్డి ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామంలో ఏ ఒక్కరు కూడా బెల్టుషాపులు నిర్వహించవద్దని, సంపూర్ణ మద్య నిషేధం పాటించాలని నిర్ణయించారు. ఎవరైనా గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని ధిక్కరించి బెల్టుషాపులు నిర్వహించి, మద్యం అమ్మితే రూ. 50 వేల జరిమానా విధించనున్నట్లు తీర్మానించారు. ఈ సందర్భంగా వారంతా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బడక శ్రీనివాస్, గూడూరు సుగుణమ్మ, సామ రాజేందర్ రెడ్డి, సామల చైతన్య, బత్తుల భిక్షం, వాకిటి కొండల్ రెడ్డి, జక్క వెంకట్ రెడ్డి, గుర్రం కృష్ణా రెడ్డి, సునీత, పద్మ, పూలమ్మ, బుచ్చమ్మ, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ గణతంత్ర వేడుకల రోజు ఏకగ్రీవ తీర్మానం
ఫ బెల్టుషాపులు నిర్వహించినా రూ.50వేల జరిమానా


