బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఆలేరు : ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు సోమవారం విడుదల చేశారు. తునికి దశరథ (3వ వార్డు ), పేరాల మంజుల(4వార్డు), పాశికంటి సంపత్(5వవార్డు), సముద్రాల కల్పన(7వ వార్డు) , బొట్ల సంపత్ (8వ వార్డు), సుక్క రాజు(9వ వార్డు )ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంపరి లక్ష్మీనారాయణ, జంపాల శ్రీను, మల్‌రెడ్డి నరిసింహా రెడ్డి, ఎలగందుల సురేష్,పట్టణ అధ్యక్షుడు గంగేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డెమాన్ నరేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకరి సజన్‌కుమార్‌గౌడ్ ఉన్నారు.


