ఎన్నికల సంఘం దిశానిర్దేశం
ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసుల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, రిజర్వేషన్లు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కూడా సూచనలు చేశారు. ఇందుకోసం ఇద్దరు పరిశీలకులను నియమించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వీడియో కాన్షరెన్స్‌లో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


