గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు
భువనగిరిటౌన్ : గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానవంతులు కావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. భువనగిరిలోని జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న వారోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, యువత సెల్‌ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వారోత్సవాలను శాఖ గ్రంథాలయాల్లో కూడా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవైస్‌చిస్తీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, రత్నపురం బలరాం, పొలి శెట్టి అనిల్‌కుమార్, బర్రె జహంగీర్, బట్టు రామచంద్రయ్య, బాలేశ్వర్, లయీఖ్‌అహ్మద్, దర్గాయి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి


