కదలరు.. వదలరు!
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయారు. స్థాన చలనం లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉండగా ఇక్కడ విస్మరించారు.
ఫైల్ కదలాలంటే ముట్టజెప్పాల్సిందే..
చౌటుప్పల్ మండలం హెచ్‌ఎండీఎ పరిధిలో ఉండడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డు సరిచేసుకునే పని నుంచి భూములు రిజిస్ట్రేషన్ వరకు ప్రతి పని వీరి ప్రమేయం లేకుండా జరగదంటే అతియోశక్తి కాదు. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ చేశాడు. దాని పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి నుంచి వెంచర్‌లోకి వెళ్లడానికి రోడ్డు నిర్మాణం చేస్తుంటే గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి రోడ్డు కోసం సిఫార్సు చేస్తూ నాటి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్‌ఓసీ తీసుకువచ్చి రియల్టర్ నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పెట్టిన తర్వాత రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడంతో ధ్రువీకరణ కోసం వచ్చిన వ్యక్తుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎవరేం చేయలేరనే ధీమా..
చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారులుగా ఉన్న వారిద్దరూ వేర్వేరు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలుగా ఉండి తమ రాజకీయ పరపతితో ఎం చేసినా మమ్మల్ని ఎవరెం చేయలేరనే ధీమాతో ఉంటున్నారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి పనులు చక్కబెడుతూ వారితో కలిసి రియల్ దందాలు సైతం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనే వీరిపై ఫిర్యాదు
సదరు అధికారులు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు, అవినితి అక్రమాలపై మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గత ఎన్నికల సమయంలో ఫిర్యాదు చేశారు. కాగా అతనిపై వత్తిడి తెచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా ప్రయత్నించారు.
రెవెన్యూలో పాతుకుపోయిన సిబ్బంది
ఫ రియల్టర్లతో చెట్టాపట్టాల్,నిషేధిత భూములకు క్లియరెన్స్‌లు
ఫ తప్పుడు రిపోర్టులతో భూముల రిజిస్ట్రేషన్‌కు సిఫార్సు


