
మానవత్వం చాటుకున్న పోలీసులు
ఆలేరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు ఆలేరు పోలీసులు. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఇక్కుర్తి గ్రామానికి చెందిన వంగాల మధుసూదన్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బహదూర్‌పేటలో ఎమ్మెల్యే కార్యక్రమానికి బందోబస్తులో పాల్గొని తిరిగి ఆలేరు పోలీస్ స్టేషన్‌కు వస్తున్న కానిస్టేబుళ్లు సైదులు, ప్రసాద్, నవీన్, అశోక్ రోడ్డు పక్కన గాయాలతో ఉన్న మధుసూదన్‌రెడ్డిని చూశారు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనానికి ఫోన్ చేసి, ఆస్పత్రికి సకాలంలో తరలించారు.
క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స
సకాలంలో ఆస్పత్రికి తరలింపు