
సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరి రిమాండ్
భూదాన్‌పోచంపల్లి: సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరిని సోమవారం పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటం గ్రామానికి చెందిన కందగట్ల కిరణ్, చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన పస్తం మల్లికార్జున్ స్నేహితులు. వారిద్దరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలోని హెజిలో కంపెనీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు పనిచేస్తూ గ్రామ శివారులో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 15న రాత్రి తలుపులు పెట్టుకోకుండా నిద్రించడాన్ని గమనించిన కిరణ్, మల్లికార్జున్ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి 6 సెల్‌ఫోన్లు అపహరించి పరారయ్యారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం అంతమ్మగూడెం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నంబర్‌ప్లేట్ లేని స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తున్న కిరణ్, మల్లికార్జున్ పట్టుకొని విచారించారు. వారు సెల్‌ఫోన్లు చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్కూటీని సీజ్ చేశారు. అనంతరం చౌటుప్పల్ కోర్టులో రిమాండ్ చేయగా, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. కిరణ్, మల్లికార్జున్‌పై గతంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో 20కి పైగా చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల చౌటుప్పల్‌లో ఓ వాహనాన్ని కూడా దొంగిలించారని ఎస్‌ఐ తెలిపారు.
గంజాయి తరలిస్తున్న
వ్యక్తి అరెస్ట్
భువనగిరిటౌన్ : రైలులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సోమవారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్వేష్ అనేమియా సర్కార్ భువనగిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం సుమారు రెండు గంటల పాటు అతడిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాధాకృష్ణ తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరి రిమాండ్

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరి రిమాండ్