
12వేల మంది దరఖాస్తు
భువనగిరిటౌన్ : అన్నదాత కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న రైతుబీమా పథకానికి జిల్లాలో కొత్తగా 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో గతంలో ఒక లక్ష 36 వేల మంది నమోదై ఉండగా.. 588 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున బాధిత కుటుంబాల ఖాతాల్లో రూ.29.40 కోట్లు జమ అయ్యాయి. గతంలో నమోదైన రైతులందరికీ బీమా రెన్యువల్ చేశారు. కొత్తగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా ఈనెల 13న దరఖాస్తు గడువు ముగిసింది.
10 రోజుల్లోనే బీమా డబ్బులు
రైతు కుటుంబాలకు ఆర్థికభద్రత కల్పించడం రైతుబీమా ప్రధాన ఉద్దేశం. రైతు ఏకారణంతో చనిపోయినా నామినీ ఖాతాలో ఎల్‌ఐసీ నుంచి 10 రోజుల్లో బీమా డబ్బు జమ చేస్తారు. నమోదైన రైతులకు ప్రభుత్వమే రూ.2,271 ప్రీమి యంగా చెల్లించి రూ.5 లక్షల బీమా అందిస్తుంది. జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వర్షాల నేపథ్యంలో బుధ, గురువారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శని వారం శ్రీకృష్ణాష్టమికి తోడుగా పెళ్లిళ్లు, బోనాల పండుగలు ఉండటం, ఆదివారం రావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజానీకం స్వస్థలాలకు వెళ్లారు. వారంతా తిరుగుపయనం కావడంతో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వాహనాల రద్దీతో చౌటుప్పల్ పట్టణంలో, జంక్షన్‌ల వద్ద పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలుచోట్ల భారీ వర్షం
సాక్షి యాదాద్రి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 11.30 వరకు కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

12వేల మంది దరఖాస్తు