
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా శ్రీకాంత్‌గౌడ
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్‌గౌడ్‌ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
ఐదుగురిపై కేసు నమోదు
నార్కట్‌పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్‌పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్‌కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్‌తో గొడవ పడి హోటల్‌లోని సామగ్రి, ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్‌కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.