ప్రాణాలతో చలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చలగాటం

Aug 18 2025 5:30 AM | Updated on Aug 18 2025 5:30 AM

ప్రాణాలతో చలగాటం

ప్రాణాలతో చలగాటం

జిల్లాలో చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల ద్వారా వ్యర్థాలను నిర్వీర్యం చేయాలన్న నిబంధనలు ఉండగా ఏ ఒక్క కంపెనీ పాటించడం లేదు. వ్యర్థ రసాయనాలను రాత్రి సమయంలో డీసీఎంలలో తీసుకువచ్చి జాతీయ రహదారులు, సాగునీటి కాలువలు, సాగు భూముల్లో పడేస్తున్నారు. అయితే ఇటీవల కెమికల్‌ మాఫియా అడ్డా మార్చాయి. చౌటుప్పల్‌ ప్రాంతంలోని పరిశ్రమలు గతంలో హై దరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి వెంట రసాయన వ్యర్థాలను పారబోసేవి. కానీ, అక్కడ పోలీస్‌ పెట్రోలింగ్‌, హైవే అధికారుల నిఘా పెరగడంతో అడ్డా మార్చినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం హైవేను ఎంచుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ వెలుగుచూడలేదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement