
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా ని ర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొ లుపులో భాగంగా అర్చకులు సుప్రఽభాత సేవ, ఆరా ధన చేశారు. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతి ష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనా మార్చనతో కొలిశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఇక ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.