
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలి
సంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్‌ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్‌గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న
యువకుడు మృతి
మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్‌లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్‌లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు.
బైక్ అపహరణ
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్‌ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్‌ను లాక్కెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ

కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ