
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
పలు కేసుల దర్యాప్తులో కీలకంగా..
ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్‌టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరి గిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సంతాపం తెలిపారు.

పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు

పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు