
కొడుకు ప్రేమ వివాహం.. కూతుర్ల పేర ఆస్తి రాసిన తండ్రి
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కూతర్లు పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కూతుర్ల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్‌గా మారింది.
దుకాణం ఎదుట బైఠాయించిన
నవ దంపతులు
పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన
పంచాయితీ