
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్‌నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి