భూదాన్‌పోచంపల్లి, వలిగొండ : మూసీకి వరద ఉధృతి పెరిగింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా మూసీలోకి చేరుతోంది. దాంతో భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్ వంతెనల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇరు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి – చౌటుప్పల్ మధ్య సుమారు 15 కిలో మీటర్లు, బీబీనగర్ – పోచంపల్లి మధ్య 30 కిలో మీటర్ల మేరకు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఈ మార్గాల్లో వారం రోజుల్లో ఐదు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ జూలూరు, సంగెం వద్ద
వంతెనలపై నుంచి వరద ప్రవాహం
ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు
మూసీకి పెరిగిన వరద ఉధృతి