
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
ఫ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహరాజ్
సంస్థాన్ నారాయణపురం: రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవిని, వాటిని యువత ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి యాదయ్య, నర్రి నర్సింహ, బైరి శేఖర్, రవీందర్, రమేష్, గాలయ్య, కిరణ్, స్వామి, యాదగిరి, శంకర్, రాజేష్, మధు, భరత్, అర్జున్ తదితరలు పాల్గొన్నారు.