
నాణ్యమైన వైద్యం అందడం లేదు
చాలామందికి సరైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందడం లేదు. అందుకే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి అమలు చేయాలి. ఫార్మా, బయోటెక్నాలజీలో దేశం ముందంజలో ఉన్నా, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో లేదు. రోబోటిక్ టెక్నాలజీని వినియోగించాలి.
–నవీన్, బయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
స్వాతంత్రం వచ్చి 79 సంవ త్సరాలు గడుస్తున్నా మహిళలపై దాడులు జరుగుతుండటం బాధాకరం. నిర్భయ లాంటి చట్టాలను తీసుకొచ్చిన దాడులు ఆగడంలేదు. మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించాలి. సెక్యులర్ ఇండియా కంటే సెక్యూర్ ఉమెన్‌తోనే దేశం పురోగతి సాధిస్తుందన్న నమ్మకం ఉంది. –విశాల, ఈసీఈ
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. సాంకేతిక పరిజ్ఞానం పల్లెలకు కూడా విస్తరించాలి. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటే ప్రపంచం, దేశంలో ఎపుడు, ఏమి జరుగుతుందని తెలుసుకొని ప్రజలు చైతన్యవంతులవుతారు. పరిశుభ్రత, ఆరోగ్యంపై గ్రామీణ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది.
–రామలక్ష్మి, ఏఐఎంఎల్

నాణ్యమైన వైద్యం అందడం లేదు

నాణ్యమైన వైద్యం అందడం లేదు