
నూతన పద్ధతులపై అవగాహన కల్పించాలి
త్రిపురారం: వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని దక్షిణ తెలంగాణ మండలి(ఏడీఆర్) సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ రాంప్రకాష్ సూచించారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకేలో వరి, కంది విత్తనోత్పత్తి ప్రదర్శనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంట, కూరగాయల సాగు, గొర్రెల పెంపకం షెడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కేవీకే కంపాసాగర్ ఆధ్వర్యంలో రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోర్డినేటర్ రాజ్‌కుమార్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఫ దక్షిణ తెలంగాణ మండలి సహ
పరిశోధన సంచాలకుడు రాంప్రకాష్