
షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగి ంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఎడవెల్లి మల్లయ్య మంగళవారం రాత్రి తాను నివాసముంటున్న పూరి గుడిసెలో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన మల్లయ్య కటుంబ సభ్యులు కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. గుడిసెతో పాటు అందులోని వస్తువులు, నిత్యావసర సరుకులు కాలిబూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్‌రావు తహసీల్దార్ అమీన్‌సింగ్‌తో కలిసి గ్రామానికి చేరుకుని కాలిపోయిన పూరి గుడిసెను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.