
పింఛన్‌దారులను మోసం చేసిన సీఎం
ఆలేరు: రాష్ట్రంలో 50లక్షల మంది పింఛన్‌దారులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కును కోల్పోయారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన చేయూత పింఛన్‌దారుల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పింఛన్‌లను పెంచుతానని హామీలతో ఓట్లడిగిన రేవంత్‌రెడ్డి.. పేద వర్గాలను నమ్మించి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్.. గడీలో పడుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రతిపక్ష నేతగా ప్రశ్నించాల్సిన బాధ్యత కేసీఆర్ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలన చాలని ప్రతిపక్షలో కూర్చొబెట్టినా, అక్కడా ఆయన విఫలమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నా ప్రజల్లోకి రాకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నేత మౌనంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. బంగ్లాలో, గడీలో పుట్టిన భూస్వాములు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లకు పూరిగుడిసెలో ఉండే పేదల కష్టాలు అర్థంకావని మండిపడ్డారు. సెప్టెంబర్ 3లోపు కొత్త పింఛన్‌ల మంజూరుతోపాటు ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌లను పెంచకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల 3న తలపెట్టిన మహాగర్జన సభకు పింఛన్‌దారులు అధికసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) నాయకుడు జాలపు సిద్ధారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీహెచ్‌పీఎస్ నాయకుడు ధనుంజయ్యగౌడ్, ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ, వీహెచ్‌పీఎస్ నాయకులు, పింఛన్‌దారుల సంఘం ప్రతినిధులు అశోక్, జహంగీర్, ఉస్మాన్, సత్తయ్య మహేందర్‌మాదిగ, చంద్రస్వామి మాదిగ రామకృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజీనామా చేసి ఇంటికెళ్లేందుకు
రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉండాలి
ఫ కాంగ్రెస్ మోసాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత.. గడీలో పడుకుండు
ఫఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ