
ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం
సూర్యాపేట: ఢిల్లీలోని ఎరక్రోటలో ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు నాగేశ్వర్‌రావుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావుకు బుధవారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి, ఉపాధ్యక్షురాలు వందనపు శ్రీదేవి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన రెండవ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున నాగేశ్వర్‌రావు పాల్గొని పతకాలు సాధించించడంతో ఆయన ప్రత్యేక ఆహ్వానం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి గూడూరు నాగేశ్వరరావు ఒక్కరికే ఈ అవకాశం రావడం గర్వకారణమన్నారు.
బాలసదన్ నుంచి
ఇద్దరు బాలికలు పరారీ
ఫ ఆరు గంటల్లోనే హైదరాబాద్‌లో
పట్టుకున్న పోలీసులు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని బాలసదన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు బాలికలు పారిపోయారు. బాలసదన్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించి వారిద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆరు గంటల్లోనే బాలికలను పట్టుకుని సంరక్షణ అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. తక్కువ సమయంలో బాలికల ఆచూకీ కనిపెట్టిన టూటౌన్ ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బంది రాజు, బాలకోటిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.
వరదలో కొట్టుకుపోయిన బైక్
మేళ్లచెరువు: చింతలపాలెం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం సాయంత్రం పులిచింతల ప్రాజెక్టు నుంచి వజినేపల్లి వెళ్లే రోడ్డులో వాగు ఉదృతంగా ప్రవహించింది. ఈ దారిలో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతుండగా.. బైక్ వరదలో కొట్టుకుపోయింది. మరో వ్యక్తి సైతం బైక్‌పై వాగు దాటుతుండగా.. కొంతదూరం వరదకు కొట్టుకుపోయి ఒడ్డుకు చేరుకున్నాడు.

ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం

ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం