
104 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
సూర్యాపేట: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని వాసవీ యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి తిరంగా జెండా ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. త్రివర్ణ పతాకం ఇళ్లపై ఎగురవేయడం ద్వారా ప్రతిఒక్కరిలో జాతీయభావం పెంపొందుతుందన్నారు. అనంతరం కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ సెంటర్, కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం వరకు 104 అడుగుల భారీ జాతీయ జెండాతో జయ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, వాసవీ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

104 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ