
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఇంటర్వ్యూ
పెన్‌పహాడ్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్న పెన్‌పహాడ్ జెడ్పీహెచ్‌ఎస్ బయోలజీ టీచర్ మారం పవిత్ర బుధవారం నేషనల్ జ్యూరీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నారు. ఇందు కోసం రాష్ట్రం వ్యాప్తంగా 107మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆన్‌లైన్ ద్వారా 21 ప్రశ్నావళి ఇచ్చి సరైన సమాధానాలు ఇచ్చిన 77మందిని స్టేట్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో నుంచి ఎంపిక చేసిన 15మందిని ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ జ్యూరీ సభ్యురాలు ఇంటర్వ్యూ చేసి ఆరుగురిని ఎంపిక చేశారు. ఈ ఆరుగురి మారం పవిత్ర ఉండగా.. వీరు బుధవారం హైదరాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఆరుగురిలో నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని జాతీయ అవార్డుకు ఎంపిక చేస్తారని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్రను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్ మదన్‌మోహన్, ఆర్‌జేడీ విజయలక్ష్మి అభినందించారు.
ఫ హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో హాజరైన పెన్‌పహాడ్ జెడ్పీహెచ్‌ఎస్ బయోలజీ టీచర్