
నిరంతరం అప్రమత్తతతో విద్యుత్ సేవలు
నేరేడుచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నిరంతరం అప్రమత్తతతో విద్యుత్ శాఖ సేవలను అందిస్తుందని టీజీఎస్‌పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ అన్నారు. బుధవారం నేరేడుచర్లలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్, ఎమర్జెన్సీ మినహా విద్యుత్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్యూజ్ ఆఫ్ కాల్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, తదితర అవసరాల నిమిత్తం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఓపెనింగ్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఎక్కడైనా విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే తెలిసిపోతుందన్నారు. వెంటనే విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేపట్టవద్దన్నారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్ విద్యుత్ డీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ టెక్నికల్ డీఈ కృష్ణారావు, ఏడీ నాగిరెడ్డి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల ఏఈలు రవివర్మ, శ్రీనివాస్ తదితరులున్నారు.
ఫ టీజీఎస్‌పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ