
కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు
కేతేపల్లి: రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో జాగృతి కార్యకర్త కూతురు జన్మదిన వేడుకకు హాజరైన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడు మళ్లీ మొదలయిందన్నారు. కేసీఆర్ హయాంలో సీజన్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా నిల్వలను తెప్పించి రైతులకు సకాలంలో సరఫరా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలను కేంద్రం నుంచి తీసుక రావటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కేంద్రంపై కొట్లాడి రైతులకు సరిపడా యూరియాను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు వెంటనే అమలు చేయాలన్నారు.
ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ