
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
పాలకవీడు: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం రావిపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ ఆర్. కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన బట్ట పవన్, కళాశ్రీ(20) భార్యాభర్తలు, వీరికి 6 నెలల కుమార్తె ఉంది. కొద్దిరోజులుగా పవన్, కళాశ్రీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన కళాశ్రీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశ్రీ కుమార్తె ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి కళాశ్రీని కిందకు దించారు. కళాశ్రీ ఒంటిపై గాయాలతో పాటు దుస్తులు చిరిగిపోయి ఉన్నాయని, ఆమె భర్త పవన్, అత్త ఉమ, మామ హనుమంతు, ఆడపడుచు ప్రియ అందరూ కలిసి తమ కుమార్తె కొట్టి చంపినట్లు కళాశ్రీ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనారోగ్యంతో డిప్యూటీ తహసీల్దార్ మృతి
భువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఎస్‌డీసీ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న శివగణేష్‌కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివగణేష్‌కుమార్ మృతి పట్ల యాదాద్రి కలెక్టరేట్ ఉద్యోగులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన గతంలో రాజాపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా విధులు నిర్వహించారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య