
వరంగల్ హైవేపై మరో ఫ్లైఓవర్
బీబీనగర్: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై నూతనంగా మరో ఫ్లై ఓవర్ రానుంది. బీబీనగర్ మండల పరిధిలో కొండమడుగుమెట్టు నుంచి ఎయిమ్స్ వైద్యకళాశాల వరకు మూడు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు.
తరచూ ప్రమాదాలు
జాతీయ రహదారిపై కొండమడుగుమెట్టు వద్ద క్రాసింగ్ అవుతున్న క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురై ఎంతో మంది మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఎయిమ్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, సూచికలు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
ఫ కొండమడుగుమెట్టు నుంచి ఎయిమ్స్ వరకు నిర్మాణం
ఫ మొదలైన పనులు