
డిమాండ్ల సాధనకు 11నుంచి పాదయాత్ర
రామన్నపేట : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీసెల్ రాష్ట్రకన్వీనర్ ఎస్‌కే చాంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రామన్నపేటలో నిర్వహించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు ఈనెల 11వ తేదీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులకు ఇంటి స్థలంతోపాటు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గంగాపురం యాదయ్య, కూనూరు శ్రీనివాస్, నర్ర అండాలు, నోముల శంకర్, బెడిద లింగస్వామి, పెండెం రవి, ఎండీ లతీఫ్, అరిగె బాలయ్య, ఎండీ జానీ, నర్ర రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.