
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి: గిరిజనుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శనివారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలం పగిడిపల్లి పరిధిలో గల గిరిజన బాలికల అశ్రమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. గిరిజన సమాజం, సంస్కృతి సంప్రదాయలను తెలియజేసేందుకు ఏటా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు మొక్కలు నాటి, సంత్‌సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, నాయకులు శంకర్‌నాయక్, గణేష్ నాయక్, మోహన్‌బాబు, రాజేష్, చిరంజీవి, సురేష్, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.