
లారీని ఢీకొట్టిన కారు..
● నలుగురికి స్వల్పగాయాలు
మునగాల: మండల కేంద్రం శివారులో శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అతివేగంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.