
భువనగిరి బస్టాండ్‌ను ఆధునీకరించాలి
గంజాయి నిందితుల అరెస్ట్
గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్యమంలా వన మహోత్సవం..
ఉద్యమం మాదిరిగా వన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.
- 8లో
సాక్షి, యాదాద్రి: భువనగిరి బస్టాండ్‌ను ఆధునీకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. భువనగిరి బస్టాండ్ నుంచి నిత్యం వేలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగి స్తుంటారని, సరైన వసతులు, సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా డీలక్స్, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చాలా వరకు బస్టాండ్‌కు రాకుండా నేరుగా బైపాస్ నుంచి వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల జన గామ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం రాత్రి పొద్దుపోయే వరకు బస్టాండ్‌లో నిరీక్షించాల్సి వస్తుందన్నారు. అన్ని రకాల సర్వీస్‌లు బస్టాండ్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. భువనగిరి నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు
పరిహారం చెల్లించాలని వినతి
బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు రూ.80 కోట్లు పరిహారం పెండింగ్ ఉందని, త్వరగా చెల్లించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విన్నవించారు. అదే విధంగా నియోజకవర్గంలో లో ఓల్టేజీ సమస్య పరిష్కరించడానికి వలిగొండకు 132/11 కేవీ సబ్‌స్టేషన్, తొ మ్మిది 11 కేవీ సబ్‌స్టేషన్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సబ్‌స్టేషన్ల శంకుస్థాపనకు రావాలని డిప్యూటీ సీఎంను ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరితో పాటు మరికొందరు మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వాలని విన్నవించారు.
ఫ మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వినతి